అందువల్లనే తాను ఒప్పుకున్న సినిమా లకు సైతం తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేసింది. 3 నెలల పాటు ఈ ముద్దుగుమ్మ ట్రీట్మెంట్ తీసుకోనుందట. ఇక ఖుషి ప్రమోషన్స్‌కు సమంత వెళ్లే అవకాశం లేదు. కాబట్టి విజయ్ ఒక్కడే ప్రమోషన్స్‌కు వెళ్ళనున్నాడు. సామ్ మ్యూజిక్ ఈవెంట్ లోనే సినిమాకు కావాల్సినంత హైప్‌ని తీసుకొచ్చింది. విజయ్, సమంత ఇద్దరూ కలిసి డాన్స్ చేయడంతో సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది.
పాన్ ఇండియా సినిమా కావడం తో చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లాల్సి ఉండేది సామ్. అక్కడికి కూడా సమంత వెల్లుంటే గ్రేస్ మరింత పెరిగేది. దాదాపు 3 నెలల పాటు న్యూయార్క్ లో మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ 3నెలలు సమంత పోస్ట్‌లు పెట్టడం తప్పితే ఏ ఈవెంట్ లోను పాల్గొనదు.
ఇక మూడు నెలల పాటు ఎటువంటి ఎంజాయ్మెంట్ ఉండదని తాజాగా తన స్నేహితుల తో కలిసి బాలి వెళ్లి ఎంజాయ్ చేసింది సమంత. అమెరికాకు వెళ్లడం పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత అమెరికాలోనే.. ఓ పెద్ద ఫ్లాట్ తీసుకుందని.. దాని ధర రూ.20కోట్లు ఉంటుందని సమాచారం. తన చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమంత. ఇందులో భాగంగానే అక్కడ ఈ భారీ ఫ్లాట్ కొనుగోలు చేసిందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి