ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మహారాజా రవితేజ లకు సంబంధించిన మూవీ లు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు..? అందుకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా లోని కొంత మంది కీలక నటీనటులపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు "యూకే" లో రవితేజ మరియు ఇతరులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: