ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి సహజనటిగా పేరుపొందింది హీరోయిన్ జయసుధ.. ప్రస్తుతం పలు సినిమాలలో తల్లిపాత్రలో నటిస్తూ మెప్పిస్తున్న జయసుధ.. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించింది జయసుధ. వెండితెర పైన అన్ని రకాల హావభావాలను ఒలకించిన జయసుధ జీవితంలో కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొందని చెప్పవచ్చు. జయసుధ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే జయసుధకు రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే...


1982 లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే ఒక వ్యాపారవేత్తను సైతం వివాహం చేసుకుంది. కొన్ని కారణాల చేత విభేదాలు రావడం చేత వీరిద్దరూ విడిపోయారు.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు జితేంద్ర కపూర్.. కజిన్ నితిన్ కపూర్ తో 1985 లో వివహం చేసుకుంది.. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అనారోగ్య సమస్యల కారణంగా 2017లో భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించారు.. అయితే జయసుధ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధం అయిందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. అమెరికాకు చెందిన ఒక వ్యక్తితో అక్కడక్కడ తిరుగుతూ కనిపిస్తూ ఉండడంతో జయసుధ మూడో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి.


వారసుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా జయసుధ పక్కనే అతను ఉండడం జరిగింది.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని సినీ ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ఇలా తన వెంట వస్తున్నారని తెలియజేసింది జయసుధ. కానీ అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలలో కూడా జయసుధ వెంట ఆ ఫారెన్ వ్యక్తి కనిపించడంతో అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహవిష్కరణ వేడుకలలో చాలామంది నటి నటులు సైతం పాల్గొన్నారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇలా ఫోటోలు బయటకు రావడంతో జయసుధ ఇతని వివాహం చేసుకోబోతుందని రూమర్లు ఊపందుకు ఉన్నాయి. మరి ఈ విషయం పైన జయసుధ ఎలా స్పందిస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: