
తెలుగులో సినిమాల్లో నటించినా కూడా మునుపటి లాగ ఆయనకు పాత్రలు రావడం లేదు.ఇలాంటి టైమ్ లో సునీల్ కి కోలీవుడ్ నుంచి మంచి అవకాశాలు లభించాయి.తమిళంలో సునీల్ నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు శివకార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా సునీల్ విలన్ గా నటించి మెప్పించాడు సునిల్. తాజాగా జైలర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా సునీల్ స్టార్ గా మారాడు.
జైలర్ సినిమాలో సునిల్ పాత్ర తమిళ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీంతో తమిళంలో సునీల్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.ఇక లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ నటించి మెప్పించాడు..సునీల్ పారితోషికం కూడా బారీగా పెరిగినట్టు సమాచారం.ప్రస్తుతం తెలుగు సినిమాలలో రోజుకు 30 వేలు రోజుకు తీసుకుంటున్న సునీల్..తమిళంలో రోజుకు 60 వేల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం