కలె గ్ మోహన్ బాబు వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటిగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెడుతూ వరుస సినిమాలు చేస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ సైతం చేస్తోంది.సినిమాల సంగతి ఎలా ఉన్నా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఆమె చేసే పోస్టులన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అందుకు రీజన్ ఏంటో తెలియకపోయినా కొన్నిసార్లు మంచి లక్ష్మిని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోలింగ్ పట్టించుకోని మంచి లక్ష్మి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 

అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వీడియోలో మంచి లక్ష్మి ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే కదా. దక్షిణ భారతదేశానికి చెందిన చాలామంది సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మంచి లక్ష్మి కూడా సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదిక బయట మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డంగా వెళ్లడంతో కోపంగా ఆ వ్యక్తి వీపు మీద కొట్టింది. ఆ తర్వాత కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటే మరో వ్యక్తి అడ్డు వచ్చాడు. 

దాంతో కోపంగా "డ్యూడ్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్స్" అంటూ మంచు లక్ష్మి అతనిపై ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే వీరిలో చాలామంది మాత్రం మంచి లక్ష్మి ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన సైమా అవార్డు ఫంక్షన్ లో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: