సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'.. ఈ సినిమా ఎప్పుడో మొదలు పెట్టినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మళ్లీ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‍లో మూడో సినిమాగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతుంది.. ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు మహేశ్. దీంతో గుంటూరు కారం సినిమాపై ఆసక్తి పెరిగింది.. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‍ లు గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
హారికా& హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చిన్నబాబు) గుంటూరు కారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 ముందుగా ఈ సినిమాకు పూజా హెగ్డేను హీరోయిన్‍గా తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యారు. ఈ చిత్రంలో జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన గంటూరు కారం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.అయితే ఈ మూవీ నుంచి వరుస అప్‍డేట్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఆసక్తి కర అప్డేట్ ని అందించారు.మ్యాడ్ సినిమా కోసం నేడు ఓ ఈవెంట్ నిర్వహించగా.. గుంటూరు కారం మూవీ గురించి నాగవంశీకి ఓ ప్రశ్న ఎదురైంది. గుంటూరు కారం మొదటి పాట ఎప్పుడు అనే ప్రశ్న అడగడం జరిగింది.దీనికి.. దసరా ముందే ఫస్ట్ సాంగ్ గురించి అప్‍డేట్ ఇస్తామని నాగ వంశీ చెప్పారు. "ఇంకా డేట్ మాత్రం ఏమీ అనుకోలేదు. దసరా ముందైతే కచ్చితంగా ఇస్తాం" అని నాగ వంశీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: