సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శ్రీకాంత్ అడ్డాల మహేష్ వెంకటేష్ లతో తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ ఘన విజయం తరువాత అతడి పేరు మారుమ్రోగిపోవడంతో మహేష్ తో వెంటనే ‘బ్రహ్మోత్సవం’ మూవీ తీసే అవకాశం ఆ దర్శకుడుకి వచ్చింది. అయితే ఆమూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ ఫ్లాప్ శ్రీకాంత్ కెరియర్ పై ప్రభావం చూపించడమే కాకుండా మహేష్ అభిమానుల చేత విపరీతంగా శ్రీకాంత్ అడ్డాల ట్రోల్ చేయబడ్డాడు.



ప్రస్తుతం ఇతడు ఒక కొత్త యంగ్ హీరోని నమ్ముకుని ‘పెదకాపు’ మూవీని ఈవారం విడుదల చేస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న రామ్ లేటెస్ట్ మూవీ ‘స్కంద’ తో ఈమూవీ పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో శ్రీకాంత్ అడ్డాల సాహసం పై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ తరువాత మహేష్ తనతో అన్న మాటలు గుర్తుకు చేసుకున్నాడు.



‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ అయిన తరువాత తాను చాల మోహమాటపడుతూ తాను మహేష్ వద్దకు వెళ్ళినప్పుడు మహేష్ ఏమి జరగనట్లు నవ్వుతూ తనను పాలకరించడమే కాకుండా సినిమా జయాపజయాలు ఎవరు ఊహించలేరని అలా ఊహించగలిగితే అందరు బ్లాక్ బష్టర్ సినిమాను తీస్తారు కథా అంటూ తనకు ధైర్యం చెప్పయిమా మహేష్ మంచి మనసును గుర్తుకు చేసుకున్నాడు.  



ఈమధ్య నిర్మాత దిల్ రాజ్ కు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీక్వెల్ తీసినట్లుగా తనకు కల వచ్చిందని చెప్పడమే కాకుండా ఆ సీక్వెల్ కథను తనను తయారుచేయమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రస్తుతం తాను ఆపని మీద ఉన్నాను అని అంటున్నాడు. అయితే మహేష్ అతిత్వరలో రాజమౌళి భారీ మూవీ ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోతున్నాడు. ఆమూవీ పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పైనే పడుతుంది. దీనితో దిల్ రాజ్ కు వచ్చిన కల నెరవేరాలి అంటే మరో రెండు సంవత్సరాలు పైన వేచి ఉండాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: