తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందులో కొంత మంది హీరోలు నటించిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడిన సందర్భాలలో ఆ మూవీ లకు భారీ రేంజ్ లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 88.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ కి వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

అక్కినేని అఖిల్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ కి వరల్డ్ వైడ్ గా 42 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది.

ఇలా మీడియం రేంజ్ హీరోలకు జరిగిన హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద సినిమా టాప్ 4 ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: