ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నాడు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. దీనితో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్‌, డైరెక్టర్ క్రిష్ కాంబో లో ఓ మూవీ ఫిక్సయినట్లు సోషల్ మీడియాలో పోస్టర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కు కభీ అప్నే కభీ సప్నే అంటూ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు గా ఈ పోస్టర్స్‌లో కనిపిస్తోంది.ఈ పోస్టర్స్‌లో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. ఒకటి క్లాస్‌, మరొకటి మాస్ లుక్ ల తో అతడి ముఖం సగం..సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్‌ గా మారింది. అల్లు అర్జున్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతుందని ఈ సినిమా తోనే అల్లు అర్జున్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రకరకాలుగా ప్రచారం కూడా జరుగుతోంది.

పోస్టర్ వెనకున్న సీక్రెట్ ఏమిటన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్‌ గా మారింది.గతంలో క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వేదం సినిమా చేశాడు . మరోసారి వీరిద్దరి కాంబో సెట్ అయిందనే వార్తలు టాలీవుడ్‌లో ఎంతో హాట్‌టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ క్రిష్ కభీ అప్నే కభీ సప్నే పోస్టర్ మిస్టరీ పై త్వరలోనే ఒక క్లారిటీ రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: