
అయితే, సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాంటాక్ట్ లాంటివి అస్సలు ఏమీ లేవని, అయినా కూడా ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదని రవీనా పేర్కొంది. ఆ సీన్స్ తనకు కాస్త అసౌకర్యంగా ఉంటాయని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుందని ఆమె చెప్పుకొచ్చింది.ఓ సన్నివేశంలో సహనటుడి పెదవులు పొరపాటున తన పెదవులకు తగిలాయని ఆమె తెలిపింది.ఆ నటుడు కావాలని చేయలేదని.. అనుకోకుండానే జరిగిందని కూడా ఆమె తెలిపింది. ఈ ఘటన తనకు ఎంతో అసౌకర్యంగా అనిపించిందని. వెంటనే రూమ్‌లోకి వెళ్లనట్లు అలాగే ఆ తర్వాత వికారంగా అనిపించి.. వాంతి కూడా అయ్యిందని.. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది అంటూ ఆమె తెలిపింది. అయితే, ఏ సినిమా షూటింగ్‌లో జరిగింది.. ఆ హీరో ఎవరూ అన్నది మాత్రం రవీనా రివీల్ చేయలేదు.అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత హీరోకు సారీ చెప్పినట్లు రవీనా వివరించారు..