బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ఉల్టా ఫుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఉల్టా ఫుల్టా అంటూ బిగ్ బాస్ మొదలుకాకముందే ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటలు నిజం చేస్తూ ఇక ప్రస్తుతం ఈ సీజన్లో అన్ని టాస్కులు కూడా కాస్త భిన్నంగానే ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ లోనే నాగార్జున హౌస్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్స్ కు 40 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్గా ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఎప్పటిలాగానే ప్రతివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.


 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు వరకు నాలుగు వారాలు పాటు నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్ హౌస్ లో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఇలా హౌస్ నుంచి బయటికి వెళ్లిన వారందరూ కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ కావడం గమనార్హం  మొదటి వారంలో కిరణ్ రెండవ వారంలో షకీలా మూడో వారంలో దామిని ఎలిమినేట్ అవ్వగా ఇటీవల నాలుగో వారంలో రతిక రోస్ ఎలిమినేట్ అయింది. ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఆట ఆడటం.. ముఖ్యంగా రైతుబిడ్డ ప్రశాంత్ తో కాస్త అతిగా ప్రవర్తించి  పారేసుకోవడంతో ఆమెపై నెగెటివిటీ పెరిగిపోయింది.

 చివరికి ఆమె తీరు నచ్చని ప్రేక్షకులు ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగిన రతిక బిగ్బాస్ ద్వారా ఎంత వెనకేసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే నాలుగు వారాలకు గాను రతిక రోజ్ ఎనిమిది లక్షలు తీసుకుందట. వారానికి రెండు లక్షల చొప్పున పారితోషకం అందుకుందట. అంటే రోజుకు 28,570 తీసుకుందట. ఇలా నాలుగు వారాలకు గాను మొత్తంగా ఎనిమిది లక్షలు తీసుకుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: