అయితే కేవలం రాజమౌళి మాత్రమే కాదు ఇక టాలీవుడ్ లెక్కల మాస్టారుగా పేరు సంపాదించుకున్న సుకుమార్ సైతం ఇలాంటి పని రాక్షసుడేనట. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా తీస్తున్నాడు. ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడట. హై సినిమాటిక్ వాల్యూస్ తో అన్ని సీన్స్ తీస్తున్నాడట. ఇక సీన్స్ పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు ఎన్ని టేక్స్ అయినా కూడా పట్టించుకోవట్లేదట. ఒకరకంగా చెప్పాలంటే షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా టార్చర్ చూపిస్తున్నాడట.
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక పుష్ప 2 సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుకుమార్.. ఇక ఎలాంటి పొరపాటు జరగకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట. ముందు అనుకున్న దానికంటే ఇక పుష్ప 2 మరింత బాగా రావాలని కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఇంత డీటెయిల్ గా ఉండడం వల్లే మూవీ షూటింగ్ కూడా కాస్త ఆలస్యం అవుతూ వస్తుందట. దీంతో ఇక పుష్ప 2 సినిమా కోసం పనిచేస్తున్న నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక సుకుమార్ ని పని రాక్షసుడు అనటం మొదలుపెట్టారట. మరి సుకుమార్ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి