సినిమా సెలెబ్రెటీలు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. వారు ఉపయోగించే కార్లు కోట్లాది రూపాయల విలువగలవి అయితే వారు ఉపయోగించే సెల్ ఫోన్స్ లక్షలాది రూపాయల విలువగలిగి ఉంటాయి. ఇక క్రేజీ హీరోయిన్ లు ఉపగించే హ్యాండ్ బ్యాగ్స్ లక్షలలో ఉంటాయి. దీనితో సినిమా సెలిబ్రెటీల చేతిలో ఏదైనా ఒక వస్తువు కనపడితే దాని ధర లక్షల రూపాయలలో ఉంటుందని చాలమంది భావిస్తూ ఉంటారు.
లేటెస్ట్ గా జరిగిన దీపావళి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇంటిలో ఒక విలాసవంతమైన డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి చాలామంది సినిమా సెలెబ్రెటీలు రావడంతో వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పరిస్థితుల మధ్య ఈ పార్టీలో వెంకటేష్ అల్లు అర్జున్ లు కలిసి తీయించుకున్న ఒక ఫోటో అందరి దృష్టిని ఆకట్టుకుంది,
ఆఫోటోలో అల్లు అర్జున్ వెంకటేష్ ల చేతిలోని సెల్ ఫోన్స్ పై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. బన్నీ చేతిలోని సెల్ లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ అయితే వెంకటేష్ చేతిలోని సెల్ సాధారణమైన ఆండ్రాయిడ్ ఫోన్ కావడమే కాకుండా ఆఫోన్ పై కొన్ని గీతలు కనిపించడం చాలమందిని ఆశ్చర్య పరిచింది. కొన్ని వేల కోట్ల ఆస్థి కలిగిన వెంకటేష్ ఇలాంటి సింపుల్ ఫోన్ వాదిత్యన్నాడా అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు.
వాస్తవానికి విలాసవంతమైన జీవితానికి వెంకటేష్ చాల దూరంగా ఉంటాడు అని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. వెంకటేష్ ఉపయోగించే కార్లు కూడ మరీ ఖరీదైనవి కావు. సినిమాలలో నటిస్తున్నప్పటికీ వెంకటేష్ కు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ అని అంటారు. అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ హిమాలయాలకు వెళ్ళి అక్కడి ప్రకృతిని ఆస్వాదించడం వెంకటేష్ కు ఇష్టమైన పని. ఎప్పటికైనా తన కెరియర్ లో స్వామీ వివేకానంద బయోపిక్ లో నటించాలి అని కలలు కంటున్న విషయం తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి