పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాతో పోటీగా బాలీవుడ్ షారుక్ ఖాన్ నటిస్తున్న డంకీ సినిమా సైతం ఒక్క రోజు వ్యవధిలో థియేటర్స్లోకి రాబోతోంది. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ దెబ్బకి ప్రభాస్ పని అయిపోతుంది అని నార్త్ ఆడియన్స్ అంటుంటే, సలార్ దెబ్బకి డంకీ గల్లంతు అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధిస్తుంది? 

సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనేది తెలియాలంటే డిసెంబర్ 21, 22 తేదీల వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ బాక్సాఫీస్ వార్ ని ఇంకాస్త హీట్ పెంచేందుకు సలార్ మూవీ నుంచి ట్రైలర్ విడుదలవుతుంటే, డంకీ నుంచి డ్రాప్ 2 పేరుతో ట్రైలర్ రిలీజ్ కానుంది. వీటిలో సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఇప్పటికే సలార్ ట్రైలర్ కండౌన్ స్టార్ట్ అయిపోయింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతా సలార్ మేనియాలో ఉండగా తాజాగా ఆ ప్లేస్ లో డంకీ ట్రెండింగ్ లోకి వచ్చింది.

 డంకీ డ్రాఫ్ 2 నవంబర్ 22 న రిలీజ్ కానుంది అంటూ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ మొదలైంది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ ట్రెండ్ అవుతున్న సమయంలో డంకీ డ్రాప్ 2 కూడా ట్రెండ్ అవ్వడం చూస్తుంటే షారుక్ - ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ కి ఈ ప్రమోషనల్ కంటెంట్స్ పునాది వేసినట్లయ్యింది. మరి ఈ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ లో షారుక్ గెలుస్తాడా? లేక ప్రభాస్ గెలుస్తాడా? అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: