ఈమె చైర్మన్ అయిన తర్వాత అపోలో హాస్పిటల్స్ అన్నీ విధాలుగానూ ఎవ్వరూ ఊహించనంత పురోగతి పొందింది. అంతే కాదు ఈ హాస్పిటల్స్ ద్వారా ఉపాసన ఎన్నో వేల మంది పేదలకు తన వంతు సహాయం గా ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అంతే కాదు సోషల్ మీడియా లో తనని అనుసరించే వాళ్లకు కూడా ఆరోగ్యం గా ఉండేందుకు టిప్స్ చెప్తూ ఉంటుంది. కరోనా మహమ్మారి సమయం లో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా పంచారో మనమంతా చూసాము. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవ కార్యక్రమాలు అపోలో హాస్పిటల్స్ ద్వారా చేసింది ఉపాసన.ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టే మెగా అభిమానులు ఆ కుటుంబం లో ఉన్న హీరోలను ఎంత ఇష్టపడతారో, ఉపాసన ని కూడా అంతే ఇష్టపడుతారు. సోషల్ మీడియా లో కూడా ఉపాసన కి ఉన్నంత ఫాలోయింగ్ చాలా మంది హీరోలకు కూడా లేదు. ఆ స్థాయి అభిమానం కేవలం ఈమె చేసే మంచి పనుల ద్వారా మాత్రమే వచ్చిందని ఆమె అభిమానులు అంటుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి