అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప వన్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ప్రస్తుతం జాతర పాటను మరియు ఫైట్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో పుష్పాటూ సినిమా యొక్క షూటింగ్ ను ఆపేసారట. ఇంతకీ బన్నీకి ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ఈ జాతర సీక్వెన్స్ లో

అమ్మోరు గెటప్ లో కనిపించబోతున్నారు. అయితే ఈ గెటప్ తో డాన్స్ వేయడంతో పాటు పవర్ఫుల్ ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈ సీక్వెన్స్ హైలెట్ కావడంతోపాటు అల్లు అర్జున్ గంటల తరబడి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట. కనీసం రెస్టు లేకుండా ప్రాక్టీస్ వెంటనే షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆయనకి తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. ఇక అల్లు అర్జున్ అస్వస్థ వార్త నెట్టింట

 వైరల్ అవ్వడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. రిలీజ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండు అన్న అంటూ నెట్టింట పోస్టులు వేస్తూ వస్తున్నారు. కాగా ఈ మూవీని 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఈ తేదీ లాంగ్ వీకెండ్ తో వస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప వన్ కి వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు బన్నీ ఫాన్స్. అంతేకాదు పుష్ప టు బాహుబలి రికార్డుని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా కనిపించబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: