పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఇక ఈ సినిమా రిలీజ్ కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కాగా తాజాగా ట్రైలర్ తెలుగు వర్షన్ కు 24 గంటల్లో 116 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎన్నో రకాల కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఇన్ని సంచలనాలను సృష్టించి నందుకు గాను అందరూ డైరెక్టర్ ను అభినందిస్తున్నారు. అయితే ట్రైలర్ కే జి ఎఫ్ సినిమా లాగా ఉండబోతుందా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులకి తాజాగా

ఒక గుడ్ న్యూస్ వినబడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన మరొక ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది అని సమాచారం వినబడుతోంది. యూట్యూబ్లో సలార్ సునామీ కొనసాగుతుండగా సినిమా రిలీజ్ లో రెండవ ట్రైలర్ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ప్రభాస్ను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ఉండబోతోంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ కు వ్యూస్ పెరగడానికి కూడా మేకర్స్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సలార్ సినిమాలో శృతి హాసన్ పాత్రకు ప్రధాన్యత తక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీచర్ రోల్ లో శృతి హాసన్ కనిపించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను మించి తెరకెక్కించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్  సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ కి అటు డైరెక్టర్ కి మరింత క్రేజ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: