సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ ... జయరామ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం "దమ్ మసాలా" అంటూ సాగే ఒక మాస్ బీట్ సాంగ్ ను విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ ను మహేష్ డిసెంబర్ 25 వ తేదీ వరకు పూర్తి చేసుకోనున్నట్లు ... ఆ తర్వాత మహేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు వెళ్లబోతున్నట్లు తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు ఉంటే డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహేష్ ... త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: