తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సోలో హీరో గా వాళ్ళు కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక అలాంటి వాళ్ల లో ఒకప్పటి హీరో రాజా ఒకరు.ఈయన శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్ అనే సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా చాలా సినిమాల్లో హీరో గా చేశాడు.ముఖ్యంగా దేవకట్టా డైరెక్షన్ లో వచ్చిన వెన్నెల సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమా లకు బ్రేక్ ఇచ్చి క్రిస్టియన్ మత ప్రచారకుడిగా తన కార్య కలపాలను కొనసాగిస్తున్నాడు.ఇక అందుకే ఆయన చాలా రోజుల నుంచి సినిమాలు చేయడానికి నిరాకరిస్తూ వచ్చారు. అయితే ఆయన సినిమా వదిలి ఇలా ప్రచారకుడు గా చేయటానికి గల కారణం ఏంటంటే ఆయనకి దైవత్వం అంటే చాలా ఇష్టం ఉండడంతో అలా దేవుడికి సేవ చేయడమే పనిగా పెట్టుకుని అదే పనిలో బిజీగా ఉంటున్నాడు. ఇక ఈయన ఫ్యూచర్ లో సినిమాలు చేస్తాడా, లేదా అనే విషయం మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి.అయితే ఇప్పటికే ఈయన సినిమాలు చేయనని తెగేసి చెప్పినప్పటికీ ఆయనకు కొంతమంది కథలు చెబుతున్నట్టుగా తెలుస్తుంది. చేయను అని క్లారిటీ గా చెప్పినప్పటికి కొంతమంది మాత్రమే అతనితో సినిమాలు చేయించాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఒక వేళ ఆయన మనసు మార్చుకొని సినిమాలు మళ్లీ చేస్తాడా లేదా అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు ఒకవేళ తన మనసు మార్చుకుని సినిమాలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు...ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికి ఈయన అభిమానులు మాత్రం ఈయన సినిమా చేస్తే చూడాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: