నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా వంటి మాస్ సినిమాతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. తాజాగా ఇప్పుడు మళ్లీ నాని హాయ్ నాన్న అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు చూస్తూ ఉంటే తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మరి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో అనే విషయంపై పలువురు ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.


సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇందులో నాని(విరాజ్) సెలబ్రెటీల ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూ ఉంటారట. నాని కూతురు(మాయ )స్కూల్ కి వెళ్తూ ఉంటుంది ఉండడంతో తన కెరియర్ను బాగా చూసుకుంటూ ఉంటారు నాని.. నాని తన కూతుర్ని ఎప్పుడు నిద్రపుచ్చడానికి ఏదో ఒక కథలు చెబుతూ ఉంటారు.. అయితే ఎక్కువగా డాడీ స్టోరీస్ ని చెబుతూ ఉంటాడట. కానీ మమ్మీ స్టోరీస్ చెప్పాలని తన కూతురు ఇబ్బంది పెట్టడంతో.. చదువులో ఫస్ట్ వస్తే చెబుతానని తెలుపుతారు నాని. అలా చదువులో ఫస్ట్ వచ్చిన తర్వాత మమ్మీ స్టోరీలను చెప్పడంతో అలిగి ఇంట్లో నుంచి తన కుక్క పిల్ల తీసుకొని బయటికి వెళ్లిపోతుందట.


అలాంటి సమయంలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్(యష్ణ) కి పరిచయమవుతుంది నాని కూతురు. ఆ తర్వాత నానికి మృణాల్ ఠాగూర్  ని పరిచయం చేస్తుంది. అలా వీరిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు ఆ సమయంలో.. అలా నాని తన కూతురికి మమ్మీ కథలు చెబుతున్నప్పుడు..యష్ణ ను ఆమె తల్లిగా ఊహించుకుంటుంది మాయ. ఆ తర్వాత ఏం జరిగింది అనేక అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఈ సినిమాలోని పాత్రలు అద్భుతంగా ఉన్నాయని ఇందులో శృతిహాసన్ కూడా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తోంది. డైరెక్టర్ శౌర్యవు కూడా ఈ సినిమాను చాలా కొత్తగా తెరకెక్కించారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఎమోషనల్ డ్రామా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొదట భాగం స్లోగా ఉన్నప్పటికీ తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ సంబంధించి చాలా సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తున్నాయి. మరి ఎ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: