ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి ప్రతి సారి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతుంటుంది. గతంలోనే ఓ హీరోతో లవ్ ట్రాక్ నడిపిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదనే క్లారిటీ వచ్చేసింది. అయితే మరోసారి అంజలి పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంజలి పెళ్లి జరిగిందని.. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గానే ఉంచిందని టాక్ వినిపిస్తుంది. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుందని ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిందని టాక్ వస్తుంది. అయితే ఈ వార్తలపై అంజలి స్పందించింది.ఈ వ్యాఖ్యలపై స్పందించిన అంజలీ.. నా పెళ్లిపై ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్లు రాసుకున్నారు. అప్పట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్టు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతుందని తెలిపిందే. ఇవన్నీ వింటుంటే నాకు నవ్వు వస్తుంది. నాకే తెలియకుండా నా పెళ్లి చేసేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అంటే ఈ వార్తలతో పెళ్లి టాపిక్ కు చెక్ పెట్టేసింది అమ్మడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి