సాధారణంగా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాతుకుపోతూ ఉంటారు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లుగా మారిపోతూ ఉంటారు. ఇలా అగ్ర హీరోయిన్గా దశాబ్ద కాలం పాటు చక్రం తిప్పుతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో కనుమరుగు అవుతూ ఉండడం  అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం కొంతమంది నటిమణులు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి హీరోయిన్ గురించె.


 అక్కినేని హీరో నాగార్జున ప్రధానపాత్రలో నటించిన మన్మధుడు సినిమా గుర్తుండే ఉంటుంది. అలా ఎలా మర్చిపోతాం నాగార్జున కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కదా.. ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వచ్చిన కూడా కన్నార్పకుండా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది అని అంటారు ప్రేక్షకులు. అయితే ఈ మూవీలో కనిపించింది కాసేపే అయినా తన అందం అభినయంతో మాత్రం కుర్రకారు మతిపోగట్టేసింది హీరోయిన్ అన్షు అంబానీ. మన్మధుడు సినిమాలో అన్షు అంబానీని చూసిన వెంటనే.. ఈ హీరోయిన్ ఏంటి ఇంత అందంగా ఉంది. చూపు తిప్పుకోలేకపోతున్నామే అని ఎంతోమంది కుర్రాళ్ళు అనుకున్నారు.


 కొన్నాళ్లపాటు ఆమెను తలచుకుంటూ కలల ప్రపంచంలోనే కుర్రాళ్ళు బ్రతికేశారు. అయితే ఈమె కెరియర్ లో చేసింది కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. కెరియర్ పీక్స్ లో ఉంది అనుకున్న సమయంలో సడన్గా పెళ్లి చేసుకుని లండన్లో సెటిల్ అయింది.  ఇలా సడన్గా సినిమాలు మానేయడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. తాను చేసిన సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలు ఎక్కువగా రావడంతో ఇక తనకు విసుగు వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడం కంటే ఖాళీగా ఉండడమే నయం అనుకొని చివరికి సినిమాలను దూరం పెట్టాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: