దీంతో సినిమాని కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తాడని బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాపై ఫస్ట్ అప్డేట్ తో చిత్ర యూనిట్ ఎలాంటి హైప్ పెంచుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఖిల్ తో సినిమా చేయడానికి ఇటీవల సక్సెస్ అందుకున్న కొంతమంది యువ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా పేరు కూడా గట్టిగానే వినిపించింది.అలాగే వక్కంతం వంశీ కేవలం కథను అంధించే ప్రయత్నంలో ఉన్నట్లు ఇండస్ట్రీలో మరొక టాక్ వచ్చింది. అయితే అఖిల్ మంచి యాక్షన్ హీరో మెటీరియల్ అని టాలీవుడ్ లో వినిపించే మాట. అందుకే ఈ కుర్ర హీరోకి సక్సెస్ లు తక్కువ ఉన్న బడా నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. ఈ సినిమా అయినా ప్రేక్షకులని మెప్పించి అఖిల్ ని సక్సెస్ వైపు నడిపిస్తుందో లేదో చూడాలి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి