టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ  సంస్థలుగా జగపతి పిక్చర్స్ సురేష్ మూవీస్ గీతా ఆర్ట్స్ వైజయంతీ మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఎన్నో విజయవంతమైన సినిమాలను తీస్తూ ఉండేవి. అయితే మారిన వాతావరణంతో సరిపెట్టుకోలేక హీరోలకు హీరోయిన్స్ కు భారీ పారితోషికాలు ఇవ్వడం ఇష్టంలేక ఈ నిర్మాణ సంస్థలు అన్నీ తాము తీసే సినిమాల సంఖ్యను బాగా తగ్గించుకున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ భారీ సినిమాలకు చిరునా మాగా మారిపోయారు. ప్రస్తుతం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ చూపిస్తున్న స్పీడ్ నిర్మిస్తున్న సినిమా లిస్టును చూసి  ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ నిర్మాణ సంస్థ  నిర్మిస్తున్న ‘పుష్ప 2 ది రూల్’ ఆగస్ట్ లో రాబోతోంది. ఈమూవీ బిజినెస్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చే విధంగా జరుగుతోంది అని అంటున్నారు. ఈమూవీ తరువాత పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాబోతోంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి కూడ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు లేటెస్ట్ గా మొదలైన బుచ్చిబబు రామ్ చరణ్ ల ‘పెద్ది’ కి కూడ వీరే నిర్మాతలు.



ఈసినిమాలతో పాటు రామ్ చరణ్ సుకుమార్ ల రంగస్థలం 2  అది చాలఫు అన్నట్లుగా ప్రభాస్-హను రాఘవపూడి మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి వీరే నిర్మాతలు అని అంటున్నారు. ఇవి కాకుండా తమిళ కన్నడ మళయాళ రంగంలో కూడ వీరు ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలను తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు ఆన్నట్లుగా టీవి సీరియల్స్ నిర్మాణ రంగంలో అదేవిధంగా ఓటీటీ సంస్థలకు వెబ్ సిరీస్ లు తీసే విషయంలో ఈ నిర్మాణ సంస్థ చాల బిజీగా  ఉంది అన్న సాంకేతాలు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం వీరి స్పీడ్ ను చూస్తూఉంటే త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అంటూ అంచనాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: