మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర పార్ట్ 1' లో నటిస్తున్నారు .. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. దేవర తరువాత  ఎన్టీఆర్ 'వార్ 2'  సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ తో పాటు ఎన్టీఆర్ మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న వార్‌ 2  “వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్స్” బ్యానర్‌లో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో రిలీజైన వార్‌ సినిమాకు కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ తో రెండు వారాలపాటు ట్రైనింగ్ సెషన్‌లో కూడా పాల్గొనబోతున్నాడని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది.తాజాగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యే టైం దగ్గర పడింది.

తాజాగా వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్  ముంబైలో ల్యాండ్ అయ్యారు.. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో 10 రోజుల పాటు వార్ 2షూటింగ్‌ కొనసాగనుందని తెలుస్తుంది.ఈ షెడ్యూల్‌లో హృతిక్‌ మరియు ఎన్టీఆర్  మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారని సమాచారం.. వార్‌ 2లో ఎన్టీఆర్ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగే స్పై రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం.ఇప్పటికే లాంఛ్ చేసిన వార్‌ 2 గ్లింప్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.కొన్ని రోజుల క్రితం వార్‌ 2 స్పెయిన్‌ షూటింగ్‌ విజువల్స్‌ బయటకు రాగా.. స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ధూమ్‌ సిరీస్‌లో విలన్‌ పాత్ర లాగే సూపర్ స్టైలిష్‌గా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని సమాచారం. వార్ 2 మూవీని  2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: