మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కళా రంగానికి చేసిన సేవలకు గాను చెన్నై కి చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఇక ఈ విషయం బయటకు రావడంతో పలువురు చరణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తన బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా చరణ్ కి తాజాగా అభినందనలు తెలియజేశాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ... గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. 

డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించాడు. ఇకపోతే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ చివరలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత చరణ్ "ఉప్పెన" మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ తర్వాత చరణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. గతంలోనే చరణ్ , సుకుమార్ కాంబో లో రంగస్థలం మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దానితో ఈ కాంబోలో తెరకెక్కబోయే నెక్స్ట్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: