పెద్ద హీరోల సినిమాలు ఈ సమ్మర్ సీజన్ లో విడుదల చేయకపోవడంతో చిన్న సినిమాలు అదేవిధంగా ఒకనాటి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లతో ఈసంవత్సరం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆశిష్ నటించిన ‘రౌడీ బాయ్స్’ ఇప్పుడు మళ్ళీ ఈవారం రీ రిలీజ్ చేస్తూ ఉండటం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.గత సంవత్సరం సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబడ్డ ఈమూవీలో క్రేజీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఉన్నప్పటికీ పెద్దగా ఈసినిమాను జనం పట్టించుకోలేదు. దేవీశ్రీ ప్రసాద్ లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అనేకమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రముఖ నటీనటులు ఈసినిమాలో నటించినప్పటికీ ఈసినిమా యూత్ కు పెద్దగా నచ్చలేదు. దీనితో ఈసినిమా పై దిల్ రాజ్ పెట్టుకున్న ఆశలు సఫలం కాలేదు అని అంటారు.ఈసినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ దిల్ రాజ్ ఆశిష్ ను యంగ్ హీరోగా నిలబెట్టాలని మరిన్ని ప్రయత్నాలు చేస్తూ ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ అన్న మూవీని తీశాడు. వాస్తవానికి ఈసినిమా ఈనెల విడుదల కావలసి ఉంది. అయితే దిల్ రాజ్ తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఫెయిల్ అవ్వడంతో దిల్ రాజ్ తమ కుటుంబ వారసుడు ఆశిష్ సినిమా పై మరన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీని వాయిదా వేసి ‘రౌడీ బాయ్స్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నాడు.అయితే ఈవిషయంలో ఎవరు ఊహించని విధంగా ఈ రీరిలీజ్ సినిమాకు కేవలం 50 రూపాయలు టిక్కెట్ రేటు పెట్టి ఈ రీ రిలీజ్ లో అయినా ఆశిష్ యూత్ కు బాగా దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోల వారసులు టాప్ హీరోలుగా కొనసాగుతున్న పరిస్థితులలో ఈనిర్మాత వారసుడు ఆశిష్ రానున్న రోజులలో ఏమేరకు సెటిల్ అవుతాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: