మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ (ఐ పి ఎల్) మ్యాచ్ లకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. దానితో అది వైరల్ కావడంతో ఈ బ్యూటీ తాజాగా అందుకు వివరణ ఇచ్చింది. అసలు ముందు ఏం జరిగింది..? దానికి ఈమె ఏం వివరణ ఇచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ కి (ఐ పీ ఎల్) టీమ్ లో మీకు ఏ జట్టు అంటే చాలా ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఈమె మాది ఆంధ్రప్రదేశ్ కదా.. ఆంధ్రప్రదేశ్ కి ఏ జట్టు లేదు. ఉండి ఉంటే దానికే నేను సపోర్ట్ చేసే దాన్ని అని ఈ బ్యూటీ జవాబు ఇచ్చింది. దానితో కొంత మంది (ఐ పి ఎల్) లో హైదరాబాద్ నుండి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జట్టు. దానిని మీరు ఎందుకు ఇష్టపడటం లేదు... సపోర్ట్ చేయడం లేదు అని విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో దిగివచ్చిన చాందిని చౌదరి తాజాగా తను అన్న మాటలకు వివరణ ఇచ్చింది.

నేను రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిని. అందుకే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ను కూడా నేను ఇష్ట పడతాను అని ఈ బ్యూటీ తాజాగా వివరణ ఇచ్చింది. ఇకపోతే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ కలర్ ఫోటో సినిమాతో హీరోయిన్ గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరుసగా ఈమెకు తెలుగు సినిమాల్లో క్రేజీ అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా విద్యాదర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

cc