ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి తనదైన పర్ఫామెన్స్ తో వరుస అవకాశాలు అందుకుంటున్న తెలుగు అందాల హీరోయిన్ వైష్ణవి చైతన్య. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో పెద్దగా ఛాన్స్ లు రావనే టాక్ చాలా కాలం నుంచి చాలా బలంగా వినిపిస్తుంది.ఇక ఎప్పటి నుంచో హీరోయిన్స్ గా కొనసాగుతున్న తెలుగు హాట్ బ్యూటీస్ గ్లామర్ షోకి అవధులు లేవంటూ సై అంటున్నా కూడా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు.అయితే బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య వరుసగా రెండు పెద్ద బ్యానర్లలో ఛాన్స్ లు అందుకోని దూసుకుపోతుంది. ఆమెకు వస్తున్న క్రేజ్ చూసి పరభాష హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్స్ లో ఫస్ట్ సినిమాతోనే యూత్ క్రష్ గా వైష్ణవి చైతన్య మంచి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాలోనే  బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అందర్నీ క్లీన్ బోల్డ్ చేసిన వైష్ణవి నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనేంతలా ప్రస్తుతం క్రేజ్ సొంతం చేసుకుంది.


ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ లవ్ మీ (ఇఫ్ యు డేర్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ హీరోగా లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. అరుణ్ భీమవరపు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో వైష్ణవి చైతన్య కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అల్లు అర్జున్ తో హీరోయిన్ నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకి కచ్చితంగా చేస్తానని వైష్ణవి సమాధానం చెప్పింది. అయితే అల వైకుంఠపురములో వైష్ణవి అల్లు అర్జున్ చెల్లెలుగా నటించింది. ఇంకా అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ చెల్లిగా నటిస్తున్నారా అని మరో జర్నలిస్ట్ అడిగగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఒకవేళ నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా జాక్ అనే మూవీలో నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: