ఇలా సినిమాలకు సంబంధించిన విషయాలు కాస్త పక్కన పెడితే.. బన్నీ వ్యక్తిగతంగా తరచూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల జిల్లాలో అల్లు అర్జున్ పర్యటించారు. భార్య స్నేహ రెడ్డితో కలిసి బన్నీ నంద్యాల వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు,వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈక్రమంలోనే అక్కడికి భారీ ఆయన ఫ్యాన్ వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ దంపతులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఎక్కడి నుంచో తెలియదు కానీ.. హైదారాబాద్ వస్తున్న క్రమంలో ఓ దాబా వద్ద బన్నీ దంపతులు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు. అల్లు అర్జున్ దంపతులు ఓ సాదా సీదా దాబాలో భోజనం చేస్తున్న ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. తమ అభిమాన హీరో..సాధారణ వ్యక్తిలా ఓ దాబాలో భోజనం చేయడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. బన్నీ దంపతులకు సంబంధించి వైరల్ అవుతోన్న ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి