పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత సలార్ అనే మూవీ తో ఒక సాలిడ్ హిట్ కొట్టాడు ప్రభాస్. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. ఇక మరోవైపు కీలకపాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ మరో హీరోయిన్ దిశా పఠాణి కీలకపాత్రలో కనిపించబోతున్నారు.


 వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ మూవీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులు అందరినీ కూడా అబ్బురపరచబోతుంది అని అటు చిత్ర బృందం కామెంట్లు చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఈవెంట్ నిర్వహించగా  ఇక ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ మూవీలో అటు కమల్ హాసన్ కేవలం కొన్ని నిమిషాల పాత్రలో మాత్రమే కనిపించబోతున్నాడట. ఇక ఈ కొద్ది నిమిషాలే ప్రభాస్, కమల్ హాసన్ మధ్య సీన్ చాలా వైలెంట్ గా ఉంటుందట. ఇక ఈ సీన్ అటు సినిమాకి ఎంతో కీలకమట  అయితే అతి కష్టం మీద ఈ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకున్నాడట కమలహాసన్. ఇక ఇందుకోసం భారీగానే పారితోషికం  కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని నిమిషాల సీన్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం తెలియదు. ఇకపోతే జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న కల్కి మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: