మహానటి’ మూవీతో జాతీయ ఉత్తమనటిగా అవార్డు పొందిన కీర్తి సురేష్ ఆతరువాత తన పద్ధతి మార్చి గ్లామర్ హీరోయిన్ గా మారాలని చాల ప్రయత్నాలు చేస్తోంది. ఈమధ్య కాలంలో ఆమె దృష్టి బాలీవుడ్ పై కూడ పడటంతో అక్కడ కూడ నటిగా రాణించాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తూ కొన్ని ఫ్యాషన్ ఫోటో ఘాట్ లలో నటిస్తూ గ్లామర్ క్వీన్ గా మారడానికి తనవంతు ప్రయత్నాలు చాల గట్టిగా చేస్తోంది.
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల సీజన్ కొనసాగుతున్న పరిస్థితులలో ఇండియాలో పేరుగాంచిన ప్రముఖుల జీవితాల పై బయోపిక్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి బయోపిక్ లకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ కూడ లభిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత కళాకారిణిగా భారతదేశం యావత్తు పేరుగాంచిన శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవితం పై ఒక బయోపిక్ ను తీయాలని తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది.మొదట్లో సుబ్బలక్ష్మి పాత్రలో నటించే విషయంలో నయనతార త్రిష లతో చర్చలు కూడ జరిగాయి. అయితే శాస్త్రీయ సంగీత కళాకారిణిగా పేరుగాంచిన సుబ్బలక్ష్మి పాత్రకు తాము న్యాయం చేయలేమని నయనతార త్రిషలు చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు ఈ బయోపిక్ లో నటించే అవకాశం కీర్తి సురేష్ కు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు వచ్చిన ఈ అవకాశం గురించి ఒక్క నిముషం కూడ ఆలోచన చేయకుండా కీర్తి వెంటనే ఓకె చెప్పినట్లు టాక్.అంతేకాదు ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక సంగీత కచేరీలు ఇచ్చిన ఆమె బాడీ లాంగ్వేజ్ నడక మాటతీరు విషయాలను క్షుణంగా పరిశీలన చేయడానికి ఆమెకు సంబంధించిన వీడియోలను పరిశీలించడమే కాకుండా శాస్త్రీయ సంగీతంలో కొన్ని ప్రాధమీక విషయాలు తెలుసుకోవడానికి ఒక ట్యూటర్ ను కూడ పెట్టుకుని చాల సీరియస్ గా ఈపాత్ర విషయంలో కీర్తి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: