ప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘కల్కి 2898’ 6 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ కథ మన పురాణాలతో లింక్ అవ్వడంతో ఈమూవీ గురించి అందరిలోనూ ఆశక్తి బాగా కనిపిస్తోంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ‘మహానటి’ మూవీల తరువాత చాల గ్యాప్ తీసుకుని నాగ్ అశ్విన్ తీసిన మూవీ కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.


ఇలాంటి భారీ చిత్రాన్ని తీసిన నాగ్ అశ్విన్ వ్యక్తిగత జీవితంలో చాల సింపుల్ గా ఉంటాడు. అతడి డ్రెస్సింగ్ అలవాట్లు మాట తీరు వ్యవహార శైలి చాల సాదాసీదాగా ఉంటుంది. కేవలం ఒక్క సినిమాకు దర్శకత్వం వహించి ఆసినిమా హిట్ అయితే కోటి రూపాయల కారులో తిరుగుతున్న నేటి యంగ్ డైరెక్టర్స్ ఉన్న ఇండస్ట్రీ వాతావరణంలో నాగ్ అశ్విన్ తీరు అందర్నీ ఎంతగానో ఆశ్చర్య పరుస్తోంది.


ప్రస్తుతం ఈదర్శకుడు వాడుతున్నది ఒక చిన్న కారు. అది కూడ 10 లక్షల లోపు ఉండే ఒక ఎలట్రానిక్ కారు. ఆకారుకు డ్రైవర్ ఉండడు. ఇంత స్థాయిలో ఉండి కూడ నాగ్ అశ్విన్ తానే సొంతంగా డ్రైవ్ చేస్తూ షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోతూ ఉంటాడు. పర్యావరణానికి హానిచేయకూడదు అన్న ఆలోచనలతో ఈదర్శకుడు ఈచిన్న కారును తాను ఉపయోగిస్తున్నట్లు తన సన్నిహితులతో చెపుతూ ఉంటాడు.


సినిమా మేకింగ్ పట్ల విపరీతమైన అభిలాషగల ఈదర్శకుడు ఈమూవీ కోసం డిజైన్ చేసిన ‘చిట్టి’ కారు మేకింగ్ కోసం ఏకంగా మెకానికల్ ఇంజనీరింగ్ లో కొంత అవగాహన ఏర్పరుచుకుని మహేంద్రా కంపెనీ వారి చేత ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేయించుకున్నాడట. అమెరికాలో ఫిలిమ్ మేకింగ్ కోర్స్ లో ఉన్నత విద్య చేసిన ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ కుమార్తెను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తల్లి జయంతీ రెడీ ప్రముఖ డాక్టర్. ఆమె సేవా దృక్పదంతో వైద్య సేవలు అందిస్తూ ఉంటారు..  మరింత సమాచారం తెలుసుకోండి: