సైజ్ జీరో నడుముతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది ఇలియానా. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. కొద్ది రోజులకు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించకుండానే తల్లయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు మూవీల నుంచి బ్రేక్ కూడా తీసుకుంది. బొద్దుగా తయారైనా అడపాదడపా మ్యూజిక్ వీడియోల్లో కనిపించి అలరించింది.

ఈ అందాల తార ఇటీవలే "దో ఔర్ దో ప్యార్" మూవీతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇలియానా కీలక పాత్ర పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా బాగుంది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. థియేటర్లలో ఆడిన కొద్ది రోజులకే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దో ఔర్ దో ప్యార్ మూవీ ఓటీటీలో సైలెంట్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్లో ఆడిందని, ఓటీటీలో రిలీజ్ అయింది అని ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు.

దో ఔర్ దో ప్యార్ మూవీలో డర్టీ పిక్చర్ ఫేమ్ విద్యాబాలన్ సెకండ్ హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది. ఇందులో ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి కథానాయకులుగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో మెడ్రన్ వరల్డ్ రిలేషన్స్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ శిర్షా గుహా.

ఈ సినిమాలో బెంగాళీ కుర్రాడు అనీ (ప్రతీక్ గాంధీ), తమిళ అమ్మాయి కావ్య (కావ్య) మ్యారేజ్ చేసుకుంటారు. మొదట్లో బాగానే ఉన్న తర్వాత అపార్థాల వచ్చి పోట్లాడుకుంటారు. పెళ్లికి ముందే అనీ నోరా (ఇలియానా) అనే సినీ నటితో అఫైర్ పెట్టుకుంటాడు. కావ్య కూడా విక్రమ్ (సెంథిల్ రామమూర్తి) అనే ఫొటోగ్రాఫర్‌తో రిలేషన్ షిప్ పెట్టుకుంటుంది. ఇలాంటి అక్రమ సంబంధాలు అనీ, కావ్య జీవితాలలో ఎలాంటి సవాళ్లు తెచ్చి పెడతాయి? ఊటీ ట్రిప్ కారణంగా వారి లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్ వస్తుంది? అనేదే ఈ సినిమా కథాంశం.

ఈ మూవీలో నోరాగా ఇలియానా చాలా స్కిన్ షో చేసింది ఇది ఒక బోల్డ్ పాత్ర ఈ పాత్రలో ఆమె అసలు మీరు మరీ రొమాన్స్ చేసింది. డైలాగ్స్, గ్లామరస్ క్యారెక్టర్‌తో పర్ఫామెన్స్ చించేసింది. మంచి నటిగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇలియానా బాగానే కష్టపడింది కానీ ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు కాబట్టి ఆమె కష్టం వృథా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: