పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా కల్కి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరకి ఫ్యాన్స్ రెండేళ్ల ఎదురుచూపులకు తెర పడుతుంది. ఈనెల 27 వ తేదీన విడుదల కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ స్టార్ట్ అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడి సినిమా అమెరికాలో ప్రీ సేల్ ద్వారా ఏకంగా 2 మిలియన్ డాలర్లను రాబట్టిందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా విడుదల అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా ఓవర్సీస్ లో ఏకంగా 15 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ తో పాటు, హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా అవ్వడం వల్ల ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.


ఉత్తర అమెరికాలో మొత్తం 210 ఐమాక్స్ షో లు ఇప్పటికే షెడ్యూల్‌ చేయబడ్డాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్‌ తో రికార్డ్‌ లు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి దాకా ఏ ఇండియన్ సినిమా కు దక్కని భారీ రిలీజ్ అమెరికాలో కల్కి సినిమా కి దక్కడం ఖాయం అంటూ అక్కడి బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీ ఇంకా విజువల్స్‌ తో కల్కి సినిమా రూపొందింది. కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ.2500 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో విడుదల అవ్వబోతుంది. మరి అన్ని వేల కోట్లు ఈ సినిమాకి సాధ్యం అవ్వాలంటే ఓవర్సీస్‌ లో ఖచ్చితంగా ఈ సినిమా అత్యధికంగా వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: