కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న మూవీ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ ని కూడా ఇటీవల ప్రారంభించారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు క్రేజీ స్టోరీస్ తో హీరోలను మరింత ఎలివేట్ చేసి చూపించే ప్రశాంథ్ నీల్ అటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వర్సటైల్ యాక్టర్ తో ఎలాంటి స్టోరీ ప్లాన్ చేశాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇక తారక్ - నీల్ కాంబో మూవీ స్టోరీ ఇదే అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో జనాలు ఈ విషయాన్ని బాగా వైరల్ చేసేస్తూ ఉన్నారు. మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్ లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుంది అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇక అందులో ఎన్టీఆర్ కార్మికుడిగా పని చేస్తారేమో నంటూ ఊహించుకుంటున్నారు. మరి కొంతమంది కార్మిక నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అంటూ ఊహగానాల్లోకి వెళ్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గాని ఎవరికీ తెలియదు.