సంక్రాంతి పండుగ వచ్చింది అంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ పోటీ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం సీనియర్ స్టార్ హీరోలే సంక్రాంతి పండుగకు తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది యంగ్ హీరోలు కూడా సంక్రాంతి పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న అలాంటి హీరోలు చాలా తక్కువ శాతమే ఉన్నారు. కానీ సీనియర్ స్టార్ హీరోలే ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి.

ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సైన్ధవ్ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలు విడుదల అయ్యాయి. ఇక వచ్చే సంవత్సరం కూడా సీనియర్ స్టార్ హీరోల జోరే సంక్రాంతి పండుగ కు ఎక్కువగా కనబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దీనిని కూడా సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నాగార్జున కూడా వీలైతే ఒక సినిమాను సెట్ చేసే దానిని ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసి సంక్రాంతి కి రావాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సీనియర్ హీరోలు ఇప్పటికీ కూడా సంక్రాంతి సీజన్ కి తమ సినిమాలను విడుదల చేయడానికి అత్యంత ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: