ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అని చెప్పాలి. దక్షిణ భారత దేశం కాదు మన దేశం నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే తొలిసారి..అంతేకాదు ఒక పూర్తి స్థాయి భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. ఉత్తమ చిత్రం విభాగంలో కాకుండా, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ అవార్డు రావడం పై దేశ వ్యాప్తంగా అందరు చిత్ర యూనిట్ ని ప్రశంసించారు..నాటు నాటు పాట ఆస్కార్ తో కలిపి ఏకంగా 9 అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంది..వాటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఎంతో ప్రత్యేకమైంది..ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ అవార్డులే కాదు జాతీయ అవార్డులు కూడా లభించాయి..69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు సాధించింది.6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆర్ఆర్ఆర్. 6 అవార్డ్స్ ఏఏ కేటగిరిలో వచ్చాయి అంటే..బెస్ట్ పాపులర్ మూవీ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ - కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) అవార్డులు వచ్చాయి.ఇలా జాతీయ,అంతర్జాతీయ వేదికలలో ఆర్ఆర్ఆర్ కి అవార్డ్స్ పంట పడింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి