
నా 16 సంవత్సరాల సినీ కెరీర్ లో దయచేసి ఈ సినిమా చూడండని ఎప్పుడూ చెప్పలేదని కానీ ఈ సినిమా విషయంలో ఆ మాట అడుగుతున్నానని పేర్కొన్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎవరూ మిస్ కాకూడదని నా కోరిక అని నాని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మీ అంచనాలను అందుకోలేదని అనిపిస్తే మాత్రం హిట్3 సినిమాను ఎవరూ చూడొద్దని నాని కామెంట్లు చేశారు.
అందుకే నేను ఇంతలా బ్రతిమాలుతున్నానని ఇంతకంటే బలంగా నేనేం చెప్పలేనని ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తం కంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా హిట్3 సినిమాపై ఖర్చు చేశానని నాని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకే ఈ సినిమా చూడమని నేను అందరికీ చెబుతానని ఆ తర్వాత మీరే ఆ మాట అందరికీ చెబుతారని నాని పేర్కొన్నారు. అయితే నానిది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిట్3 సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నాని భవిష్యత్తు సినిమాలు సైతం టాలీవుడ్ రేంజ్ ను పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.