టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీలలో ఊర్వసి రౌతేలా ఒకరు. డాకు మహారాజ్ సినిమాలో ఒక సాంగ్ లో డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచిన ఊర్వశి రౌతేలా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో సైతం కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో హిట్ గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అయితే నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ మూవీ స్ట్రీమింగ్ అయిన సమయంలో ఈ సంస్థ ఊర్వశి రౌతేలా లేని పోస్టర్ ను షేర్ చేయడం జరిగింది. డాకు మహారాజ్ మూవీకి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అలా చేయడం గురించి ఆమె స్పందించారు. ఒరిజినల్ రిలీజ్ పోస్టర్ లో ఉన్న నా ఫోటోని తొలగించి నెట్ ఫ్లిక్స్ అదే ఫోటోని షేర్ చేసిందని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చారు. నెట్ ఫ్లిక్స్ కావాలనే అలా చేసిందని అందరూ అనుకున్నారని ఆమె పేర్కొన్నారు.
 
అందులో ఎలాంటి నిజం లేదని నెట్ ఫ్లిక్స్ కావాలని అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. అది ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టర్ షేర్ చేయలేదని అనుకోకుండా జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ ఓటీటీ సంస్థ తప్పు గ్రహించి మాకు సారీ చెప్పిందని తర్వాత నా ఫోటోలతో ఉన్న కొత్త పోస్టర్లను షేర్ చేసిందని ఊర్వశి రౌతేలా వెల్లడించడం గమనార్హం.
 
తొలిసారి షేర్ చేసిన పోస్టర్ లో నా ఫోటో లేకపోవడంతో నా ఫ్యాన్స్ ఫీలయ్యారని ఆమె చెబుతున్నారు. అయితే ఊర్వశి రౌతేలా తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవ్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా ఊర్వశి వార్తల్లో నిలిచారు. ఊర్వశి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఊర్వశి రౌతేలా పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: