కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీలతో అదిరిపోయే రేంజ్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే విజయ్ నటించిన చాలా సినిమాలను కూడా డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆ మూవీలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా అనేక ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ అద్భుతంగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా విజయ్ హీరో గా రూపొందిన సినిమాలను కూడా వరుసగా రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొంత కాలం క్రితం విజయ్ హీరో గా రూపొందిన గిల్లి మూవీ ని రీ రిలీజ్ చేయగా ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ఏకంగా 32.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ రీ రిలీజ్ లలో సరికొత్త రికార్డును సృష్టించింది. కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ "సచిన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని తాజాగా రీ రిలీజ్ చేశారు.

మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు 13.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అలా సచిన్ మూవీ కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: