టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు.అందులో  కిష్కిందపురి  సినిమా కూడా ఒకటి ఇందులో హీరోయిన్గా అనుపమ నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాక్షసుడు సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కిష్కిందపురి చిత్రాన్ని డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఏడాదిపైనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.


నిన్నటి రోజున బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ వస్తుందనుకుంటే తాజాగా చిత్ర బృందం ఒక గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ తోనే భయపెట్టేలా కనిపిస్తున్నారు.. గ్లింప్స్ విషయానికి ఆకాశవాణి.. ప్రతి వాతావరణం క్షీణత.. అనే మాటలతో మొదలవుతుంది.. ఆ తర్వాత ఒక పాత బంగ్లా ని చూపిస్తారు. ఇంకా బంగ్లాని బెల్లంకొండ శ్రీనివాస్ బద్దలు  కొడుతున్నట్లు చేయబోతున్నట్లు చూపించారు.. ఆ బంగ్లా కి ఉన్న తాళం పగల కొట్టి ఓపెన్ చేయగానే ఆ బంగ్లాలో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక్కసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ గుంపు మీదికి వస్తాయి.



ఇక తర్వాత బంగ్లాలో జరిగేటువంటి సంఘటనలు గ్లింప్స్ లో చూపించారు.. అనుపమ ఇందులో కూడా మరొక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చివరిలో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్స్ అందరినీ కూడా భయపెట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి సరికొత్త కాన్సెప్ట్ తో ఈసారి ప్రేక్షకులను అభిమానులను మరింత ఆకట్టుకునేలా చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు..కానీ త్వరలోనే థియేటర్లోకి రాబోతోందని మాత్రం చెప్పారు. ఇక ఇవే కాకుండా రాక్షసుడు 2, భైరవం, టైసన్ నాయుడు, హైందవ తదితర చిత్రాలను నటిస్తూ ఉన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. మొత్తానికి ఈ గ్లింప్స్ అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: