నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 5.40 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 15 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 33.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5.50 కోట్ల బిజినెస్ జరగగా , ఓవర్సీస్ లో 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 48.90 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. దానితో ఈ మూవీ దాదాపు 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల షేర్ కలెక్షన్లు గనుక వచ్చినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: