న్యాచురల్ స్టార్ నాని గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్3 తాజాగా రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందో విఫలమైందో ఇప్పుడు చూద్దాం.
 
కథ :
 
44 సంవత్సరాల వయస్సు ఉన్న అర్జున్ సర్కార్ (నాని) భయం అంటే తెలియని, క్లిష్టమైన కేసును సైతం తన తెలివితేటలతో పరిష్కరించే కాప్. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తున్న అర్జున్ కు ఒక సైకో కిల్లర్ ను పట్టుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వరుస హత్యలు చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? అర్జున్ సర్కార్ తన తెలివితేటలతో ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కిన హిట్1, హిట్2 సక్సెస్ సాధించగా హిట్3 సినిమాలో నాని హీరోగా నటించడంతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగింది. ట్రైలర్ కొత్తగా ఉన్నట్టే సినిమా కూడా కొత్తగా ఉంది. నానిని కొత్తగా చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సైంధవ్ తో విమర్శల పాలైన శైలేష్ హిట్3 ఫస్టాఫ్ ను బాగానే డీల్ చేసినా సెకండాఫ్ ను మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దలేదు. నాని, శ్రీనిధి పాత్రల మధ్య లవ్ ట్రాక్ సైతం కొత్తగా ఉంది.
 
చివరి అరగంట వేరే లెవెల్ లో ఉండటం హిట్3 సినిమాకు ప్లస్ అయింది. స్క్విడ్ గేమ్ నుంచి స్పూర్తి పొంది సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను రాసుకున్నారు. నాని, శ్రీనిధి తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకు అనుగుణంగా ఉన్నాయి. కార్తీక శ్రీనివాస్ తన ఎడిటింగ్ తో మ్యాజిక్ చేశారు.
 
రావు రమేష్, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, బ్రహ్మాజీ తమ పరిధి మేర మెప్పించారు. నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మాణ విలువలు బాగున్నాయి. సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
 
బలాలు : నాని యాక్టింగ్, శైలేష్ డైరెక్షన్, ఫస్టాఫ్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్
 
బలహీనతలు : సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు, శృతి మించిన వయొలెన్స్
 
రేటింగ్ : 3.0/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: