సినిమా ఇండస్ట్రీలో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యింది అంటే మాత్రం కచ్చితంగా దానికి రివ్యూలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నాని నటించిన హిట్ త్రి సినిమాకి సంబంధించిన రివ్యూస్ ఎలా వైరల్ అవుతున్నాయో బాగా గమనిస్తున్నాం.  ఆశ్చర్యమేంటంటే ఒక్కరంటే ఒక్కరు కూడా నాని సినిమాపై నెగిటివ్ కామెంట్ ..నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు.  చాలా చాలా సినిమా బాగుంది అంటూ చెప్పుకొస్తున్నారు. సినిమాలో పూర్తిస్థాయి వైలెన్స్ ఉన్న సినిమాపై కామన్ పీపుల్స్ కూడా కన్వీన్సింగ్గా  కామెంట్స్ పెడుతూ ఉండడం అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నలిచింది.


మరీ ముఖ్యంగా వీకెండ్ కావడంతో జనాలు హిట్  త్రీ సినిమా చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా హిట్ త్రీ సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ వైల్డ్ కాదు వైల్డ్ కి అమ్మ మొగుడి లాంటి ఒక పర్ఫామెన్స్ అంటూ పొగిడేస్తున్నారు. నాని దగ్గర నుంచి ఇలాంటి వైల్డ్ పర్ఫామెన్స్ వస్తుంది అని ..నానిలో ఇంత  వైల్డ్  యాక్టర్ దాగున్నాడు అని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు . కాగా ఈ సినిమాలో నాని కాకుండా మరి ఏ హీరో నటిస్తే బాగుంటుంది అని జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు .



కాగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొందరికే బాగా సూట్ అవుతూ ఉంటాయి . అయితే ఈ క్యారెక్టర్ లో నాని కాకుండా మరొక హీరోని ఊహించుకోలేం . అది సాధ్యమైన పని కాదు . ఒకవేళ నాని కాకుండా ఈ క్యారెక్టర్ కి ఏ తెలుగు హీరో బాగా సూట్ అయ్యుండేవాడు అంటే మాత్రం కచ్చితంగా చాలామంది రానా దగ్గుబాటి పేరుని సజెస్ట్ చేస్తున్నారు . ఒకవేళ రానా దగ్గుబాటి ఈ క్యారెక్టర్ చేసుంటే ఇంకా వైల్డ్ గా ఉండేదేమో అని .. రానా విలన్ షేడ్శ్ కటౌట్ ఈ పాత్రకు బాగా సూట్ అయి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు.  మొత్తానికి నానికి హిట్ 3 సినిమాతో తన పేరు మారుమ్రోగిపోవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ కూడా తనఖాతాలో వేసుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: