సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది హీరోలు తెలుగుతో పాటు అనేక భాషా చిత్రాలలో హీరోలుగా రాణిస్తారు. అలాంటి వారిలో హీరో అజిత్ ఒకరు. తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో తమిళంలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం లలో అనేక భాష సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అజిత్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి గొప్ప పేరును పొందాడు. 

హీరో అజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బైక్ మీద ఒంటరిగా ట్రావెల్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అజిత్ వయసు పెరిగినప్పటికీ అంతే హ్యాండ్సమ్, ఫిట్నెస్ తో కనిపిస్తూ సినిమాలలో నటిస్తున్నారు. తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోని హీరో అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అజిత్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాను. ఏదో ఒక రోజు సినిమాల నుంచి బలవంతంగా దూరం కావచ్చని నటుడు అజిత్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎప్పుడు ఎవరికీ ఏం జరుగుతుందో మనం అసలు చెప్పలేము. సినిమాల నుంచి రిటైర్మెంట్ పై ఇప్పుడు నేనేమీ అనుకోవడం లేదు. కానీ బలవంతంగా ఏదో ఒక రోజు సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచి మనం బతికి ఉండడమే ఒక అదృష్టం అని నేను భావిస్తానని హీరో అజిత్ అన్నారు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నానని హీరో అజిత్ పేర్కొన్నారు. ప్రస్తుతం అజిత్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: