కొంతమంది హీరోలు అప్పుడప్పుడు ఫ్లాప్ సినిమాల కోసం హిట్ అయ్యే సినిమాలను వదులుకుంటారు. కానీ వారికి ముందుగా తెలియదు కదా.. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుందో.. వారికి ఏ కథ నచ్చుతుందో ఆ కథే ఒప్పుకుంటారు. అయితే రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కోర్టు మూవీలో ప్రియదర్శి పాత్ర ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా కంటే ముందే ప్రియదర్శికి హీరోగా గుర్తింపు ఉంది. కానీ ఈ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. కానీ ప్రియదర్శికి వచ్చిన ఈ గుర్తింపు రావాల్సింది మరో హీరోకి. కానీ ఆ హీరో మిస్ చేసుకోవడంతో ప్రియదర్శికి అవకాశం వచ్చింది. మరి ఇంతకీ కోర్టు మూవీలో ప్రియదర్శి పాత్రను విష్ చేసుకున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. నాని వాల్ పోస్టర్ బ్యానర్లో రామ్ జగదీష్ దర్శకత్వం లో వచ్చిన సినిమా కోర్టు. 

హర్ష్ రోషన్,శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి మెయిన్ రోల్ లో నటించిన కోర్టు సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా చూసి మెచ్చుకొని ప్రేక్షకుడు అంటూ లేరు. అలా విమర్శకులను ప్రశంసించేలా చేసిన కోర్టు మూవీలో ప్రియదర్శి ఒక సాధారణ లాయర్ గా కనిపించారు. అయితే లా పూర్తి చేసిన కూడా ఎలాంటి కేసులు లేకుండా ఉండే ప్రియదర్శి ఒక పవర్ఫుల్ కేసును ఎలా వాదించారు అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి పోషించిన పాత్రకి చాలామంది మంచి రివ్యూ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ మరో హీరోని అనుకున్నారట.కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో ప్రియదర్శిని ఇందులో తీసుకున్నారట.

ఇక ప్రియదర్శి పాత్రను వదులుకున్న ఆ హీరో ఎవరో కాదు శ్రీ విష్ణు.. యంగ్ హీరో శ్రీ విష్ణు మంచి మంచి సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే ఈయన కి మొదట కోర్టు మూవీలో ప్రియదర్శి చేసిన రోల్ వచ్చిందట. కానీ అప్పటికే ఆయన స్వాగ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉండడం కారణంగా ఆ సినిమాని రిజెక్ట్ చేశారట.అలా శ్రీ విష్ణు రిజెక్ట్ చేయడంతో అధి కాస్తా ప్రియదర్శి చేతిలోకి వచ్చింది.అలా ఈ సినిమాలో ప్రియదర్శి చేసి మంచి హిట్ కొట్టారు.ఇక ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు శ్రీ విష్ణు కమర్షియల్ గా ఫ్లాప్ అయిన స్వాగ్ సినిమా కోసం బంగారం లాంటి కోర్టు మూవీ ఛాన్స్ వదులుకున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: