
కొందరు మాత్రం స్పెషల్ సాంగ్స్ లో అస్సలు నటించమంటూ తెగేసి చెబుతున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది మహానటి కీర్తి సురేష్ . కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . కీర్తి సురేష్ నటన .. టాలెంట్.. అందం ఏ హీరోయిన్ కి లేనే లేదు అని చెప్పాలి. కాగా కీర్తి సురేష్ ని కూడా చాలా మంది డైరెక్టర్ లు స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . కానీ కీర్తి సురేష్ మాత్రం నో అంటూ తెగ్గేసి చెప్పేస్తుందట . మరీ ముఖ్యంగా సమంత కెరీయర్ని టర్న్ చేసిన "ఉ అంటావా మావ" పాట కోసం ముందుగా సుకుమార్ ..హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నారట .
కానీ ఆమె నో చెప్పడంతో ఆ ఆఫర్ సమంత వద్దకు వచ్చిందట. అంతేకాదు అంతకుముందే సుకుమార్ రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి పాట కోసం కూడా కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యారట. హైలెట్ ఏంటంటే ఆమె ముందే ఆ పాటను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఆ ఆఫర్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. పూజ హెగ్డే - సమంత ఇద్దరు కూడా ఐటెం సాంగ్ లో మెరిసి తమకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. కీర్తి సురేష్ ఈ పాటలను రిజెక్ట్ చేసుకున్న ఆమె కెరియర్ కూడా బాగా హై స్ధానంలోనే ఉండింది..!