మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అంజలి , కియార అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా భారీ అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి ఏ రేంజ్ లో నష్టాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి గేమ్ చేంజర్ మూవీ తెలుగు వర్షన్ కి నైజాం ఏరియాలో 19.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10.45 కోట్లు , ఉత్తరాంధ్రలో 10.48 కోట్లు , ఈస్ట్ లో 7.97 కోట్లు , వెస్ట్ లో 4.5 కోట్లు , గుంటూరులో 6.72 కోట్లు , కృష్ణ లో 5.37 కోట్లు , నెల్లూరులో 3.96 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.45 కోట్ల షేర్ ... 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ తెలుగు వర్షన్ కు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 12.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు వర్షన్ కు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 86.20 కోట్ల షేర్ ... 146.80 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ తెలుగు వర్షన్ కు ఏకంగా 80.80 కోట్ల రేంజ్ లో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా తెలుగు పర్సన్ కి భారీ అపజయం అందినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: