
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఆఖండ 2 పై అంచనాల మామూలుగా లేవు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను కసితో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దసరా కనుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే వచ్చే జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు కానుకగా పలు ట్రీట్ లు ఆయన సినిమాల నుంచి రానున్నాయి. లేటెస్ట్ గా ఊహించని ట్రీట్ ఇప్పుడు ఖరారు అయింది. బాలయ్య నటించిన మాస్ సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ఒకటైన లక్ష్మీనరసింహ సినిమా బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీస్ కు రెడీ అవుతుంది.
బాలయ్య పుట్టినరోజు జూన్ 10 కాక దానికి ముందే జూన్ 7 నుంచి ఈ సినిమా ధియేటర్లలోకి రానున్నట్టుగా కన్ఫామ్ అయ్యింది. జయంత్ సీ పరంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 2004 సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ వర్షం - మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాలకు పోటీగా రిలీజ్ అయ్యి .. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కేంద్రాలలో 50 రోజులకు పూర్తి చేసుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ రోజుల్లోనే లక్ష్మీ నరసింహా సినిమా 277 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా ఆసిన్ హీరోయిన్గా నటించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు